![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో.. తన గతాన్ని గుర్తుకు చేసుకుని సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. నా కుటుంబం పోగొట్టుకున్నవన్ని తిరిగి సంపాదించుకున్నానని ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. మరొకవైపు సిరి ఒక ఎమోషనల్ వీడియోని ధనకి పంపిస్తుంది.. నువ్వు నా బర్త్ డే కి వస్తేనే నా బర్త్ డే జరుగుతుంది. లేదంటే డెత్ డే జరుగుతుందని సిరి ఓ వీడియో పంపిస్తుంది. అది చూసి ధన బాధపడతాడు
ఆ తర్వాత రామలక్ష్మి ధన దగ్గరికి వస్తుంది. సిరి ఫోటో చూపించి నీకు ఈ అమ్మాయి తెలుసా? మీ కాలేజీలోనే చదువుతుందంట... నేను వర్క్ చేసేది వాళ్ళ అన్నయ్య దగ్గరే అని ధనకి చెప్పగానే అతను షాక్ అవుతాడు. ఈ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందంట? అసలు ఏంటి మ్యాటర్ అని తెలుసుకోమని మా బాస్ రిక్వెస్ట్ చేసాడు. అందుకే అడుగుతున్న అయిన నిన్ను డిస్టబ్ చేయను చదువుకోమని రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు తన చెల్లి సిరి బర్త్ డే గనుక తనకి డ్రెస్ తీసుకోవడానికి సీతాకాంత్ షాపింగ్ కి వెళ్తాడు. అపుడే పెద్దయన మన స్టాఫ్ కి కూడా బట్టలు తీసుకుంటే బాగుంటుందని అనగానే సరే అని సీతాకాంత్ అంటాడు. అపుడే నాకు వర్క్ ఉంది రామలక్ష్మికి నువ్వు సెలక్ట్ చెయ్ అని పెద్దాయన వెళ్తాడు. ఆ తర్వాత బర్త్ డే కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. బర్త్ డే కి సిరి రెడీ అయి ఒంటరిగా కూర్చొని ధన గురించి బాధపడుతుంది. నేను మా అన్నయ్యకి స్పెషల్ కావచ్చు.. కానీ నువ్వే నాకు స్పెషల్ ధన అని సిరి ఎమోషనల్ అవుతుంది.
మరొకవైపు శ్రీలత సిరి డల్ గా ఉంటుందని సందీప్ కి చెప్తుంది. ఒకవేళ సిరి లవ్ మ్యాటర్ సీతాకాంత్ కి తెలిస్తే ఎలా అని శ్రీలత అంటుంది. తెలిసే ఛాన్స్ ఉండదని సందీప్ అంటాడు.. ఆ తర్వాత రామలక్ష్మి చీరలో రావడం చూసి సీతకాంత్ ఫ్లాట్ అవుతాడు. చీరలో బాగున్నావని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు. వాళ్ళు అలా మాట్లాడుకోవడం పెద్దాయన వాళ్లు చూసి మురిసిపోతుంటారు. మరొకవైపు ధన బాధలో సిగరెట్ కాలుస్తుంటే మాణిక్యం వస్తాడు.. ఆ తర్వాత రామలక్ష్మిని శ్రీవల్లి చూసి నా చీర కంటే రామలక్ష్మి చీర బాగుందని అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మిని శ్రీవల్లి పిలిచి నీ చీర బాగుందని చెప్పగానే.. సీతాకాంత్ సర్ కొన్నారని అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |